Pawan Kalyan: మరోసారి ధ్వజమెత్తిన పవన్.. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ అంటూ ట్వీట్!

Janasena Chief Pawan another tweet aims AP Govt
  • పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి పాలిస్తే సుపరిపాలనా?
  • ‘నవరత్నాలు’ భావి తరాలకు నవకష్టాలుగా మారాయి
  • ప్రభుత్వ హామీలు.. తీసుకున్న చర్యలకు సంబంధించి వివరాలు షేర్ చేసిన జనసేనాని
ఓ సినిమా ఫంక్షన్‌లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు నిన్న విరుచుకుపడ్డారు. పవన్ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. మంత్రి పేర్ని నాని అయితే పవన్‌పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏపీ, తెలంగాణ సహా టాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ కాగా, తాజాగా పవన్ మరోమారు స్పందించారు. ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ క్యాప్షన్‌తో ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.  

ఇష్టానుసారం ప్రజల మీద పన్నులు రుద్ది, మద్యం ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేసి పాలిస్తే అది సుపరిపాలన అనిపించుకోదని విమర్శించారు. సంక్షేమం అసలే కాదని నిప్పులు చెరిగారు. ‘నవరత్నాలు’ భావితరాలకు నవకష్టాలుగా మారాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తూ కటిక నిజాలు ఇవేనని క్యాప్షన్ జత చేశారు. ఏపీ పరిస్థితి ఇలా ఉందంటూ మరో స్నాప్‌షాట్‌ను కూడా షేర్ చేశారు.



Pawan Kalyan
Andhra Pradesh
Janasena
YSRCP

More Telugu News