Aishvarya Rajesh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Aishvarya Rajesh likes Samanthas performance
  • సమంత ఇష్టమంటున్న హీరోయిన్!
  • బాలకృష్ణ 'అఖండ' ఇక సంక్రాంతికే!
  • సూర్య మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్   
*  సమంత అంటే తనకు చాలా ఇష్టమని అంటోంది యువకథానాయిక ఐశ్వర్య రాజేశ్. 'గత హీరోయిన్లను తీసుకుంటే సౌందర్య గారంటే నాకు ఇష్టం. ఇప్పటి హీరోయిన్లలో మాత్రం సమంత ఇష్టం. అటు గ్లామర్ పాత్రలని, ఇటు అభినయంతో కూడిన పాత్రలని ఆమె చక్కగా చేస్తుంది' అంటూ ఐశ్వర్య తన అభిమానాన్ని చాటుకుంది.
*  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'అఖండ' విడుదల తేదీపై ఓ క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత తాజాగా నిర్ణయించుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.  
*  ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్న తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో 'అన్నాత్తే' చిత్రాన్ని రూపొందిస్తున్న శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతుంది.
Aishvarya Rajesh
Samantha
Balakrishna
Surya

More Telugu News