భారత్‌కు తిరిగొచ్చిన ప్రధాని మోదీ
- అమెరికాలో మూడు రోజుల పర్యటన పూర్తి
- యూఎస్‌లో 65 గంటల్లో 20 సమావేశాలు
- విమానంలో కూడా నాలుగు సుదీర్ఘ సమావేశాలు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పలువురు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు. ఈ బిజీ షెడ్యూల్ ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరికొంత మంది పార్టీ నేతలు మోదీకి స్వాగతం పలికారు.