Andhra Pradesh: అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను సొంతం చేసుకున్న వైసీపీ... జిల్లాల వారీగా జెడ్పీ ఛైర్మన్ల వివరాలు ఇవిగో!

  • జిల్లా పరిషత్ పదవులను స్వీప్ చేసిన వైసీపీ
  • గుంటూరు జెడ్పీ ఛైర్మన్ గా క్రిస్టినా
  • విశాఖ జెడ్పీ ఛైర్మన్ గా జల్లిపల్లి సుభద్ర
YSRCP wins all ZP Chairman elections

ఏపీలోని అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులను వైసీపీ సొంతం చేసుకుంది. వారి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా - బోయ గిరిజమ్మ, చిత్తూరు జిల్లా - శ్రీనివాసులు, తూర్పుగోదావరి జిల్లా - వేణుగోపాల రావు, పశ్చిమగోదావరి జిల్లా - కవురు శ్రీనివాస్, గుంటూరు జిల్లా - హెనీ క్రిస్టినా, కర్నూలు జిల్లా- వెంకట సుబ్బారెడ్డి, కృష్ణా జిల్లా - ఉప్పాళ్ల హారిక, నెల్లూరు జిల్లా - ఆనం అరుణమ్మ, ప్రకాశం జిల్లా - వెంకాయమ్మ, కడప జిల్లా - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, విశాఖ జిల్లా - జల్లిపల్లి సుభద్ర, విజయనగరం జిల్లా - మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా - విజయ. అన్ని జిల్లా పరిషత్ ఛైర్మన్ల పదవులను సొంతం చేసుకోవడంతో వైసీపీ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

More Telugu News