Mahesh Babu: శంకర్ 'స్నేహితుడు' సినిమాను మహేశ్ బాబు ఎందుకు వద్దనుకున్నారో తెలుసా?

Srinu Vaitla reveals interesting fact about Mahesh Babu
  • మహేశ్ బాబు, సమంత జంటగా దూకుడు
  • శ్రీను వైట్ల దర్శకత్వం
  • బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం
  • దూకుడుకు పదేళ్లయిన సందర్భంగా శ్రీను వైట్ల ఇంటర్వ్యూ
దక్షిణాది సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఒప్పుకోని హీరో ఎవరైనా ఉంటారా? కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్నారు. ఆ సినిమా స్నేహితుడు. మహేశ్ బాబు స్నేహితుడు సినిమాకు ఓకే చెప్పకపోవడానికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది.

ఆ సమయంలో తెలుగు దర్శకుడు శ్రీను వైట్ల దూకుడు సినిమా తెరకెక్కిస్తున్నారు. టర్కీలో షూటింగ్ కు వెళ్లేముందు శ్రీను తన ఫాంహౌస్ లో ఓ విందు ఏర్పాటు చేసి మహేశ్ బాబును ఆహ్వానించారు. అప్పటికే స్నేహితుడు సినిమా డేట్స్ కోసం మహేశ్ బాబుతో శంకర్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో, శ్రీను వైట్ల దూకుడు సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలను మహేశ్ బాబుకు చెప్పగానే, ఆయన తీవ్ర ఉద్విగ్నతకు గురయ్యారట. శ్రీను వైట్ల చెప్పిన కొన్ని పంచ్ డైలాగులు వినగానే మహేశ్ ఇంకేమీ ఆలోచించకుండా, దూకుడు సినిమాకు అధిక సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

వెంటనే తన అర్ధాంగి నమ్రతకు ఫోన్ చేసి, స్నేహితుడు సినిమా చేయడంలేదని శంకర్ బృందానికి చెప్పాలని సూచించారు. ఈ పరిణామంతో శ్రీను వైట్ల, నమ్రత ఇద్దరూ దిగ్భ్రాంతికి గురయ్యారట. దూకుడు సినిమా వచ్చి పదేళ్లయిన సందర్భంగా  దర్శకుడు శ్రీను వైట్ల ఈ విషయాలను  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేశ్ బాబు, సమంత హీరోహీరోయిన్లుగా వచ్చిన దూకుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
Mahesh Babu
Dukudu
Snehitudu
Srinu Vaitla
Shankar
Tollywood

More Telugu News