ICMR: కొవిడ్ చికిత్స నుంచి రెండు ఔషధాలను తొలగించిన ఐసీఎంఆర్

ICMR drops two medicines from covid treatment
  • కొవిడ్ చికిత్సకు తాజా మార్గదర్శకాలు
  • ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ల తొలగింపు
  • ప్రత్యేక సందర్భాల్లో రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ వాడకం
  • స్పష్టం చేసిన ఐసీఎంఆర్
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) దేశంలో కొవిడ్ చికిత్సకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల జాబితా నుంచి ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ లను తొలగించింది. ఐసీఎంఆర్ కు చెందిన నేషనల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ మోనిటరింగ్ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్దవాళ్లకు కొవిడ్ చికిత్స మార్గదర్శకాల సవరణలో ఈ రెండు ఔషధాలను ఇకపై వినియోగించరాదని వెల్లడించింది.

ఇక, రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలను మాత్రం ప్రత్యేకమైన సందర్భాల్లోనే వాడాలని స్పష్టం చేసింది. కొవిడ్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉన్న రోగులకు మాత్రమే రెమ్ డెసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలతో కూడిన చికిత్స అందించాలని ఐసీఎంఆర్ అనుబంధ విభాగం తెలిపింది.
ICMR
Ivermectin
Hydroxychloroquine
Covid Treatment
India

More Telugu News