ఆచంట మండలంలో టీడీపీ, జనసేన ఒప్పందం.. ఎంపీపీ, ఉప ఎంపీపీ పదవుల కైవసం
- టీడీపీకి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు జనసేన అంగీకారం
- జనసేనకు ఉప ఎంపీపీ పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్న టీడీపీ
- ఆచంటలో ఎంపీపీ పదవి దక్కించుకోలేకపోయిన వైసీపీ
ఆచంటలో ఇటీవల వెల్లడైన ఫలితాల్లో టీడీపీకి చెందిన ఏడుగురు గెలుపొందారు. అలాగే, వైసీపీకి చెందిన ఆరుగురు, జనసేనకు నలుగురు ఎంపీటీసీలు ఉన్నారు. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. చివరకు టీడీపీ, జనసేన ఒప్పందం కుదుర్చుకుని ఎంపీపీ, ఉప ఎంపీపీ పదవులను దక్కించుకున్నాయి.