Bandi Sanjay: కేసీఆర్‌కు బండి సంజయ్ బ‌హిరంగ లేఖ

bandi sanjay writes letter to kcr
  • రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి
  • రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని అమ‌లు చేయాలి
  • రూ.27,500 కోట్ల నిధులను విడుదల చేయాలి
  • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బ‌హిరంగ లేఖ రాశారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని బండి సంజ‌య్ డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500 కోట్ల నిధులను విడుదల చేయాలని చెప్పారు.

అలాగే, వరి పంట వేయకూడ‌దంటూ ఇచ్చిన ప్రకటనను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని ఆయ‌న అన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము రూ.413.50 కోట్లు చెల్లించాల‌ని చెప్పారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాల‌న్నారు. రైతుల‌ను దళారీల నుంచి రక్షించాలని చెప్పారు.

ధరణిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాల‌ని అన్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో తాము రైతులకు అండగా పోరాటాన్ని కొన‌సాగిస్తామని తెలిపారు. తెలంగాణ‌లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని చెప్పారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News