Amitabh Bachchan: ఆ యాడ్ నుంచి తప్పుకోండి: అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ లేఖ

National Anti Tobacco Organisation writes letter to Amitabh Bachchan to skip Pan Masala Add
  • పాన్ మసాలాకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న అమితాబ్
  • పొగాకు వల్ల ప్రజలకు క్యానర్స్ వస్తుందన్న యాంటీ టొబాకో ఆర్గనైజేషన్
  • ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రకటనల నుంచి తప్పుకోవాలని విన్నపం
భారత సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖను రాసింది. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో కోరింది. పాన్ మసాలాలో పొగాగు ఉంటుందని... ఇది ప్రజలను వ్యసనపరులుగా మారుస్తుందని... దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రకటనల నుంచి వైదొలగాలని విన్నవించింది. ఈ మేరకు నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ లేఖ రాశారు.

అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని... అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. వీలైనంత త్వరగా అమితాబ్ ఈ యాడ్ నుంచి తప్పుకోవాలని... అప్పుడు పొగాకు వ్యసనానికి యువత దూరమయ్యేందుకు దోహదపడినట్టవుతుందని చెప్పారు.

పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని... అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్ కు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఈ లేఖపై అమితాబ్ ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది వేచి చూడాలి.
Amitabh Bachchan
Bollywood
Pan Masala
Tobacco
National Anti Tobacco Organisation

More Telugu News