Pawan Kalyan: సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్

Pawan Kalyan to attend Saitej Republic movie pre release event
  • సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్'
  • అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
  • ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఇటీవలే ట్రైలర్ విడుదల చేసిన చిరంజీవి
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్
మెగా హీరో సాయితేజ్ నటించిన 'రిపబ్లిక్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. రోడ్డుప్రమాదానికి గురైన సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆగడంలేదు. ఈ క్రమంలో సెప్టెంబరు 25న 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా, పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు.

తన మేనల్లుడు ఆసుపత్రిలో ఉండడంతో, అతడు నటించిన సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా 'రిపబ్లిక్' చిత్రం ట్రైలర్ విడుదల చేసి మేనల్లుడి చిత్రానికి తనవంతు ప్రచారం కల్పించారు. దేవా కట్టా దర్శకత్వంలో వస్తున్న 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు.
Pawan Kalyan
Republic Day
Pre Release Event
Sai Tej
Tollywood

More Telugu News