KCR: ఢిల్లీకి బయల్దేరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR going to Delhi
  • నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి హాజరుకానున్న కేసీఆర్
  • సమావేశానికి అధ్యక్షత వహించనున్న అమిత్ షా
  • మూడు రోజులు హస్తినలోనే ఉండనున్న కేసీఆర్
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనుంది. గతంలో జరిగిన ఇదే సమావేశానికి కేసీఆర్ హాజరుకాలేదు.

 మరోవైపు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరినైనా కలిసే అవకాశం ఉందా? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఒకే నెలలో కేసీఆర్ రెండోసారి ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలో మకాం వేయనున్నట్టు సమాచారం.
KCR
TRS
Delhi
Amit Shah
BJP

More Telugu News