MAA: పెరిగిన 'మా 'ఎన్నిక‌ల వేడి.. త‌న‌ ప్యానెల్ స‌భ్యుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన మంచు విష్ణు

Vishnu Manchu For my MAA our privilege and honor MAA Panel
  • విష్ణు ప్యానెల్‌లో జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీగా ర‌ఘుబాబు
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్
  • వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల ర‌వి, పృథ్వీరాజ్
  • అక్టోబ‌రు 10న మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కార్యవర్గాన్ని సినీనటుడు మంచు విష్ణు ప్ర‌క‌టించారు. విష్ణు ప్యానెల్‌లో జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీగా ర‌ఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబూమోహ‌న్, వైస్ ప్రెసిడెంట్లుగా మాదాల ర‌వి, పృథ్వీరాజ్ ఉన్నారు. అక్టోబ‌రు 10న మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  

ప్రకాశ్ రాజ్ కూడా 'మా' అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యుల పేర్లను ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్యానెల్‌ లో ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బెనర్జీ, హేమ పోటీ చేయనున్నారు. అలాగే, ప్రధాన కార్యదర్శిగా జీవిత రాజశేఖర్, ట్రెజరర్ గా నాగినీడు పోటీ చేస్తారు.
 
ఇక మంచు విష్ణు ప్యానెల్‌లోని స‌భ్యుల పూర్తి వివ‌రాలు..
      
MAA
Manchu Vishnu
Tollywood

More Telugu News