Junior NTR: 9999 నంబర్‌ను సొంతం చేసుకోవడానికి లక్షలు వెచ్చించిన జూనియర్ ఎన్టీఆర్!
- కొత్త కారుకు 9999 ఫ్యాన్సీ నంబర్ ను సొంత చేసుకున్న తారక్
- ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో నిన్న వేలంపాట
- రూ. 17 లక్షలకు నంబర్ ను సొంతం చేసుకున్న తారక్
వాహనాల రిజిస్ట్రేషన్లలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంత ఖర్చైనా భరించి ఆ నంబర్లను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. వారిలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 9999 నంబర్ ను తారక్ అమితంగా ఇష్టపడతాడు. తాజాగా తాను కొనుక్కున్న కారుకు టీఎస్09ఎఫ్ఎస్9999 నంబర్ ను ఆయన సొంతం చేసుకున్నాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో కొత్త సిరీస్ కు నిన్న వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో రూ. 17 లక్షలు వెచ్చించి 9999 నంబర్ ను సొంతం చేసుకున్నాడు.
తారక్ తాత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా 9999 నంబర్ ను ఇష్టపడేవారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన అంబాసడర్ కారుకు 9999 నంబర్ ఉండేది. మరోవైపు, ఇదే వేలంపాటలో టీఎస్09ఎఫ్టీ0001 నంబర్ ను లహరి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 7.01 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది.