వైసీపీ ఘన విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరిస్తోంది: గుడివాడ అమర్ నాథ్
- ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ ఇచ్చింది చంద్రబాబే
- కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేయించారు
- అధికారంలోకి రాగానే 90 శాతం హామీలను జగన్ నెరవేర్చారు
అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ 90 శాతం హామీలను నెరవేర్చారని అమర్ నాథ్ తెలిపారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్ అని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలను తప్పుదోవ పట్టించేందుకే అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు మాట్లాడించారని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్నపాత్రుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.