Jakkampudi Raja: రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నాడు: ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

YCP MLA Jakkampudi Raja fires om MP Bharat
  • రాజమండ్రి వైసీపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
  • ఎంపీ భరత్ పై ధ్వజమెత్తిన జక్కంపూడి రాజా
  • భరత్ తనను ఏం చేయలేరని స్పష్టీకరణ
  • భరత్ వి పిచ్చిచేష్టలని విమర్శలు
వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ భరత్ పై జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్ సర్వనాశనం చేస్తున్నారని రాజా మండిపడ్డారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి భరత్ సెల్ఫీలు తీసుకుంటారా? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. సీఎం జగన్ ను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తులతో భరత్ కు పనేంటి? అని నిలదీశారు.

రౌడీ షీటర్లు, భూకబ్జాదారులు భరత్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఎంపీ భరత్ పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారని, తనను మాత్రం ఏంచేయలేరని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు.
Jakkampudi Raja
Margani Bharat
YSRCP
Rajamundry

More Telugu News