Balapur Laddoo: బాలాపూర్ లడ్డూను సీఎం జగన్ కు బహూకరిస్తానన్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్

MLC Ramesh Yadav says he will gift Balapur Laddoo to CM Jagan
  • రికార్డు నెలకొల్పిన బాలాపూర్ లడ్డూ
  • వేలంలో రూ.18.90 లక్షల ధర
  • సొంతం చేసుకున్న ఏపీ ఎమ్మెల్సీ రమేశ్, శశాంక్ రెడ్డి
  • జగన్ కోసమే వేలంలో పాల్గొన్నట్టు రమేశ్ వెల్లడి
వినాయకచవితి నేపథ్యంలో బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. తెలంగాణలో అత్యధిక ధర పలుకుతూ గత కొన్నేళ్లుగా బాలాపూర్ లడ్డూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది రూ.18.90 లక్షల రికార్డు ధరతో కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, నాదర్ గుల్ కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ మాట్లాడుతూ, బాలాపూర్ లడ్డూను సీఎం జగన్ కు బహూకరిస్తానని వెల్లడించారు. కేవలం సీఎం జగన్ కు లడ్డూను కానుకగా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాను బాలాపూర్ వేలంలో పాల్గొన్నానని రమేశ్ యాదవ్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ లడ్డూను సీఎం జగన్ కు అందిస్తానని వివరించారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ లడ్డూ వేలం కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు.
Balapur Laddoo
MLC Ramesh Yadav
CM Jagan
Andhra Pradesh

More Telugu News