Atchannaidu: అందుకే మేము ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాం: అచ్చెన్నాయుడు

atchennaidu slams ycp
  • ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేత‌లు ఖూనీ చేశారు
  • అధికార పార్టీకి అధికారులతో పాటు పోలీసులు సహకరించారు
  • ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు.  ఏపీలో జ‌రిగిన‌ పరిషత్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేత‌లు ఖూనీ చేశార‌ని, అందుకే తాము ఆ ఎన్నికలను బ‌హిష్క‌రించామ‌ని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి అధికారులతో పాటు పోలీసులు సహకరించారని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదని ఆయ‌న తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం జగన్‌కు ఉందా? అని ఆయ‌న అడిగారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నేత‌లు ఎలా అపహాస్యం చేశారో దేశం మొత్తం చూసిందని ఆయ‌న చెప్పారు.  మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం కోసం అక్రమ కేసులు పెట్టార‌ని ఆయ‌న చెప్పారు.


Atchannaidu
YSRCP
Andhra Pradesh

More Telugu News