Ayyanna Patrudu: చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు... అదే రీతిలో నేను తెలుగులో అన్నాను: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu gives explanation on her comments on Jagan
  • చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు యత్నించారు
  • సీఎం జగన్ ను నేను తిట్టలేదు
  • మంత్రులు చేస్తున్న పనులను బట్టే నేను అలా సంబోధించాను
తమ అధినేత చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు యత్నించారని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ ను తాను తిట్టలేదని అన్నారు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటుంటారని... తాను కూడా అదే రీతిలో తెలుగులో అన్నానని చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చేస్తున్న పనులను బట్టే తాను అలా సంబోధించానని... తన మాటల్లో తిట్లు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు.
Ayyanna Patrudu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News