CJ: తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా... కొత్త సీజేలను సిఫారసు చేసిన కొలీజియం

New CJs for Telangana and AP high courts
  • ఇటీవల తెలంగాణ, ఏపీ హైకోర్టుల సీజేలు బదిలీ
  • కొత్త సీజేల ఎంపిక ప్రక్రియ చేపట్టిన కొలీజియం
  • రాష్ట్రపతికి సిఫారసులు
  • పరిశీలించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ఇటీవల తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టుకు బదిలీ కాగా, ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించిన ఏకే గోస్వామి ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు వారి స్థానంలో తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలు రానున్నారు.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీజేలను అధికారికంగా ప్రకటిస్తారు.
CJ
High Court
Telangana
Andhra Pradesh
Supreme Court

More Telugu News