America: కమలా హ్యారిస్ హత్యకు కుట్ర.. ఫ్లోరిడా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష

  • కుట్ర పన్నిన నివియేన్ పెటిట్ ఫెల్ప్స్ 
  • హత్యకు రూ. 39 లక్షలతో సుపారి
  • నేరాన్ని అంగీకరించిన నిందితురాలు
Florida Woman Pleads Guilty to Threatening to Kill Kamala Harris

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ హత్యకు ఓ మహిళ చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మియామీ ఫెడరల్ కోర్టులో హాజరు పరిచారు. కమలా హ్యారిస్‌ను హత్య చేసేందుకు దుండగులతో 53 వేల డాలర్లకు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39 లక్షలు) ఒప్పందం కుదుర్చుకున్నట్టు నిందితురాలు న్యాయస్థానంలో అంగీకరించింది.

దక్షిణ ఫ్లోరిడాకు చెందిన నివియేన్ పెటిట్ ఫెల్ప్స్ (39) కమలను హత్య చేసేందుకు ఏకంగా ఆరుసార్లు కుట్ర పన్నినట్టు కోర్టులో అంగీకరించింది. 50 రోజుల్లో కమలను హత్య చేయబోతున్నానంటూ జైలులో ఉన్న తన భర్తకు వీడియో మెసేజ్ పంపడం ద్వారా ఆమె దొరికిపోయింది. ఆమె కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచాయి. కమలను హత్య చేసేందుకు తుపాకి లైసెన్స్‌కు కూడా ఆమె దరఖాస్తు చేసుకుంది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితురాలిని దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

More Telugu News