Jithender Reddy: హరీశ్ రావు తోలుబొమ్మలా ఆడుతున్నారు: జితేందర్ రెడ్డి

Harish Rao is KCRs puppet says Jithender Reddy
  • ఏడేళ్లుగా అబద్ధాలు చెపుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది
  • దత్త గ్రామాన్ని కూడా హరీశ్ రావు అభివృద్ధి చేయలేదు
  • లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు
మంత్రి హరీశ్ రావుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు... వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో తోలుబొమ్మలా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా ప్రజలకు అబద్ధాలు చెపుతూ టీఆర్ఎస్ గెలుస్తోందని... ఇప్పుడు ఆరోజులు పోయాయని అన్నారు. టీఆర్ఎస్ అబద్ధాలు చెపుతోందనే విషయం ప్రజలకు అర్థమయిందని... ఇకపై అబద్ధాలు చెప్పి గెలిచే రోజులు పోయాయని చెప్పారు.

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిందని... అప్పటి నుంచి ప్రభుత్వం ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఓడిన చోట కేసీఆర్ ప్రభుత్వం పని చేయదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు దత్తత తీసుకున్న కొల్గుర్ గ్రామంలోనే 60 ఇళ్లను నిర్మించలేకపోయారని... ఇక హుజూరాబాద్ ను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం, దళితబంధులను హరీశ్ చేయలేకపోయారని విమర్శించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Jithender Reddy
Etela Rajender
BJP
KCR
Harish Rao
TRS
Huzurabad

More Telugu News