Sharmila: రేపిస్ట్ రాజు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ అసమర్థతను వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు: వైఎస్‌ ష‌ర్మిల

sharmila slams kcr
  • ప్రభుత్వ అసమర్థతను చెబుతున్నాడు
  • కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని చూపుతున్నాడు
  • మేము నిన్న చేసిన దీక్ష వల్లే  ఈ రోజు మంత్రులు దిగొచ్చారు
  • బాధిత‌ కుటుంబాన్ని పరామర్శించారు
హైద‌రాబాద్‌లోని సైదాబాద్ బాలిక హ‌త్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ వద్ద ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల స్పందించారు. తాము నిన్న చేసిన దీక్ష వల్లే ఈ రోజు మంత్రులు బాధిత‌ కుటుంబాన్ని పరామర్శించారని ఆమె చెప్పుకొచ్చారు.

'సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖం చెల్లని ఈ ప్రభుత్వ పెద్ద‌లు..  మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగొచ్చి ఈ రోజు మంత్రులు బాధిత‌ కుటుంబాన్ని పరామర్శించారు.

నిన్న, మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు ఈరోజు నిందితుడు చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలె. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ఒక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు' అంటూ ష‌ర్మిల ట్వీట్లు చేశారు.
Sharmila
YSRTP
Telangana

More Telugu News