Kadapa District: కడప జిల్లాలో ఘోరం: పెనుభూతమైన అనుమానం.. భార్య కాలు, చేయి నరికేసిన భర్త

Husband cut off wifes leg and hand with axe in kadapa
  • 25 ఏళ్ల క్రితం వివాహం
  • భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులు
  • గొడ్డలితో కాలు, చెయ్యి నరికి పరారీ
కట్టుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతంగా మారడంతో కర్కశంగా ప్రవర్తించాడో భర్త. ఆమె కాలు, చేయి తెగనరికేశాడు. కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ (45) భార్యాభర్తలు. 25 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది.

ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో నిన్న ఇద్దరి మధ్య మరోమారు గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన నాగనాయక్ గొడ్డలితో భార్య కాలు, చేయి నరికేశాడు. వెంటనే అప్రమత్తమైన బంధువులు ఆమెను వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు నాగనాయక్ కోసం గాలిస్తున్నారు.
Kadapa District
Wife
Husband
Crime News

More Telugu News