ఖైరతాబాద్ లో వచ్చే ఏడాది నుంచి మట్టిగణపతి.. ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం!
- పీవోపీ విగ్రహాల వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారుతోందని హైకోర్టు ఆవేదన
- పీవోపీ విగ్రహాల నిమజ్జనం కుదరదన్న హైకోర్టు
- హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
హుస్సేన్ సాగర్లో ఈ ఒక్క ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో జీహెచ్ఎంసీ పిటిషన్ దాఖలు చేసింది. నిమజ్జనానికి అనుకూలంగా హుస్సేన్ సాగర్లో 25 బేబీ పాండ్స్ కూడా నిర్మించామని కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం పీవోపీ విగ్రహాల వల్ల హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇకపై అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. రసాయనాలు లేని, మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు మాత్రం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉత్సవ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ నేడు విచారణకు రానుంది.