భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు
- ఆరుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
- వారిలో ఇద్దరు పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు
- దేశంలో అలజడి సృష్టించాలని ప్లాన్
- అరెస్టయిన వారి నుంచి పేలుడు పదార్థాల స్వాధీనం
అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదుల పేర్లు ఒసామా, జీషన్ అని, వారు పాకిస్థాన్ లో శిక్షణ పొందినవారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పలు రాష్ట్రాల్లో భారీ పేలుళ్లతో విధ్వంసానికి వీరు కుట్ర పన్నారని వెల్లడించారు. యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో ఐఈడీల సాయంతో అలజడి సృష్టించాలన్నది వీరి ప్రణాళిక అని ఢిల్లీ పోలీస్ విభాగం స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా వెల్లడించారు. ఒసామా, జీషన్ పాకిస్థాన్ ఐఎస్ఐ ఆదేశాలతో పనిచేస్తున్నట్టు గుర్తించామని తెలిపారు.