Naseeruddin Shah: సీఎం ఆదిత్యనాథ్ "అబ్బా జాన్" వ్యాఖ్యలపై మండిపడిన బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా

Bollywood actor Naseeruddin Shah fires on UP CM Yogi Adithynath Abba Jan remarks
  • ఇటీవల "అబ్బా జాన్" అంటూ యూపీ సీఎం వ్యాఖ్యలు
  • హిందువుల రేషన్ తినేస్తున్నారంటూ ఓ వర్గంపై విమర్శలు
  • యూపీ సీఎం వ్యాఖ్యలపై దుమారం
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నసీరుద్దీన్ షా
ఇటీవల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సామాజిక వర్గం వారిని ఉద్దేశించి "అబ్బా జాన్" అని పిలుచుకునేవాళ్లు హిందువుల రేషన్ ను తినేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కూడా సీఎం ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అబ్బా జాన్" అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు కనీసం స్పందించడానికి కూడా తగినవి కావని అన్నారు. ధిక్కరణ పూరిత వ్యాఖ్యలుగా పరిగణించాల్సి ఉంటుందని నసీరుద్దీన్ షా విమర్శించారు.

"ఆయనేంటి, ఆయన స్థాయి ఏంటి? ఇలాగేనా మాట్లాడేది? ఈ వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి? అయితే ఒక్క విషయం స్పష్టమవుతోంది. "అబ్బా జాన్" అంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తన విషం చిమ్మే కార్యాచరణకు కొనసాగింపు అని తెలుస్తోంది" అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Naseeruddin Shah
Abba Jan
Yogi Adityanath
Uttar Pradesh

More Telugu News