Andhra Pradesh: ఏపీఈఏపీసెట్ లో ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేశ్

APEAPCET Results Out For Agri and Pharmacy Branches
  • అగ్రి, ఫార్మసీ ఫలితాలు విడుదల
  • 92.85 శాతం ఉత్తీర్ణత
  • కోరుకొండకు చెందిన విష్ణుకు ఫస్ట్ ర్యాంక్
  • ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాల విడుదల
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ ఈఏపీసెట్) 2021 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేయగా.. తాజాగా ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. ఈ రెండు విభాగాల్లో 83,822 మంది దరఖాస్తు చేసుకోగా.. 78,066 మంది పరీక్ష రాశారని, 72,488 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. 92.85 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంక్ సాధించాడని చెప్పారు. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయ రెండు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావుకు మూడో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన గజ్జల సమీహనరెడ్డి, కాసా లహరికి నాలుగు, ఐదు ర్యాంకులు వచ్చాయని ఆయన తెలిపారు.
Andhra Pradesh
Telangana
APEAPCET
Engineering
Agriculture
Pharmacy
Adimulapu Suresh

More Telugu News