cs: ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ నియామకం!
- 30న ఆదిత్యనాథ్ దాస్ పదవీవిరమణ
- అక్టోబర్ 1న సమీర్ శర్మ పదవీ బాధ్యతలు
- 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుండడంతో కొత్త ప్రధాన కార్యదర్శి గా సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 1న సమీర్ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్ గవర్నెన్స్ సంస్థ వైస్ ఛైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.