Nara Lokesh: నారా లోకేశ్ ను అరెస్టు చేస్తుండ‌గా తీసిన వీడియోను పోస్ట్ చేసిన దేవినేని ఉమ‌!

nara lokesh slams jagan
  • లోకేశ్  అరెస్ట్ అప్రజాస్వామికం
  •  ఆడబిడ్డలకు న్యాయం చేయాల‌ని అడిగితే అరెస్టు చేస్తారా?
  •  లోకేశ్ పర్యటనకు ఎందుకు భయపడుతున్నారు?
  •  రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు

కొన్ని రోజుల క్రితం ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను పరామర్శించడానికి నరసరావుపేట పర్యటనకు వెళ్తున్న టీడీపీ నేత  నారా లోకేశ్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు పోస్ట్ చేశారు.

'తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  అరెస్ట్ అప్రజాస్వామికం. ఆడబిడ్డలకు న్యాయం చేయాల‌ని అడిగితే అరెస్టు చేస్తారా? లోకేశ్ పర్యటనకు ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు వైఎస్ జ‌గ‌న్' అని ఆయ‌న మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News