KCR: తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR wishes people of Telangana
  • రాష్ట్ర సాంస్కృతిక ఉద్యమానికి కాళోజీ మాతృ భాష స్ఫూర్తి దిక్సూచిగా నిలిచిందన్న కేసీఆర్
  • భాషా  సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని కితాబు
  • కాళోజీ సేవలు మరువలేనివన్న రేవంత్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి కాళోజీ మాతృ భాష స్ఫూర్తి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని చెప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. సాహిత్య, భాష రంగాల్లో కాళోజీ చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. కాళోజి ఆశయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
KCR
TRS
Revanth Reddy
Congress
Telangana
Kaloji
Language day

More Telugu News