తెలంగాణలో కొత్తగా 329 కరోనా కేసుల నమోదు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 329 కరోనా కేసుల నమోదు

Media Bulletin on status of positive cases in Telangana
  • రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న 307 మంది పేషెంట్లు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,497
  • రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసులు 6,60,471  
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 329 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కరోనా మరణం సంభవించింది. 307 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ గణాంకాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,60,471కి చేరుకుంది. ఇదే సమయంలో 6,51,085 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3,889 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,497 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,421 మంది శాంపిల్స్ ని పరీక్షించారు.
Telangana
Corona Virus
Updates

More Telugu News