ఏపీలో కొత్తగా 1,361 కరోనా కేసుల నమోదు!

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 61,363 మంది శాంపిల్స్ పరీక్షించగా... 1,361 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 282 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 1,288 మంది కరోనా నుంచి కోలుకోగా... 15 మంది మృతి చెందారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,24,603కి పెరిగాయి. మొత్తం 19,96,143 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,950 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,510 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


More Telugu News