Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు డ్రగ్స్ వాడుతున్నారు: బండి సంజయ్

TRS leaders are using drugs says  Bandi Sanjay
  • గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారు
  • బీజేపీ అధికారంలోకి రాగానే రక్త పరీక్షలను నిర్వహిస్తాం
  • భాష విషయంలో కేసీఆరే నా గురువు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. తన భాషను అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారని... భాష విషయంలో కేసీఆరే తన గురువని అన్నారు. బీజేపీతో తప్ప అన్ని పార్టీలతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం కేసీఆర్ కు వచ్చిందని... అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Drugs

More Telugu News