శశికళకు పెద్ద షాక్.. రూ. 100 కోట్ల ఆస్తులను సీజ్ చేసిన ఐటీ శాఖ!
- తమిళనాడులో 24 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు
- 2014లో అక్రమాస్తులుగా తీర్పును వెలువరించిన కర్ణాటక స్పెషల్ కోర్టు
- సీజ్ చేసినట్టు నోటీసులు అతికించిన ఐటీ శాఖ
2014లో కర్ణాటక స్పెషల్ కోర్టు జడ్జి జాన్ మిఖాయెల్ కున్హా ఈ ఆస్తులను అక్రమాస్తులుగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించారు. ఆ అక్రమాస్తులు జయలలిత, శశికళకు చెందినవని తెలిపారు. ఆనాటి కోర్టు తీర్పును అనుసరించి బినామీ నిరోధక చట్టం కింద ఐటీశాఖ ఈరోజు ఆ ఆస్తులను సీజ్ చేసింది. ఆస్తులు ఉన్న ప్రాంతంలో వాటిని సీజ్ చేసినట్టు నోటీసులు అతికించారు.
అయితే, ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే, ఈ ఆస్తులను శశికళ ఉపయోగించుకోవచ్చు, కానీ ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపడానికి మాత్రం వీలుండదు. నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత శశికళ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సంగతి తెలిసిందే. శశికళ వయసు 67 సంవత్సరాలు.