Bandi Sanjay: తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం: త‌మ నినాదాన్ని వినిపించిన బండి సంజ‌య్‌

will introduce population control legislation says bandi sanjay
  • 2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక‌ కొత్త చ‌ట్టం
  • ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం
  • 'ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు' ఇదే మా నినాదం  
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాదయాత్ర చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ నినాదాన్ని వినిపించారు. 'ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం' అని బండి సంజ‌య్ చెప్పారు. ఈ నినాదంతోనే తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

'2023లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా తెలంగాణలోనూ జనాభా నియంత్రణ చట్టం తీసుకొస్తాం. ఒక్కరు చాలు.. ఇద్దరు హద్దు.. ముగ్గురు అసలే వద్దు ఇదే మా నినాదం' అని బండి సంజ‌య్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయ‌న ఈ రోజు పోస్ట్ చేశారు.

'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించడానికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్నా, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తూ కేసీఆర్ చట్టం తీసుకురావాలని చూశారు. బీజేపీ అడ్డుకోవడంతో భయపడి వెనక్కు తగ్గారు. దమ్ముంటే బిల్లు పెట్టి చూడు. ఎక్కడ అడ్డుకోవాలో, అక్కడ అడ్డుకుని తీరుతాం' అని బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.
Bandi Sanjay
BJP
Telangana

More Telugu News