Rasi Khanna: తనకి కాబోయేవాడు అలా ఉండాలంటున్న రాశిఖన్నా!

Rasi Khanna needs a husband conditions apply
  • పెళ్లి మాటపై స్పందించిన రాశి ఖన్నా
  • అందగాడు కాకపోయినా ఫరవాలేదు
  • ఆధ్యాత్మిక చింతన ఉండాలి
  • దేవుడిపై నమ్మకం ఉండాలి

అందాల రాశిఖన్నా ఇటీవల కాలంలో తన దూకుడు పెంచేసింది. నిన్నమొన్నటివరకూ నిదానమే ప్రధానమన్నట్టుగా తాపీగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె, ఈ మధ్య వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటూ వెళుతోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

అలాంటి రాశి ఖన్నాకి తాజా ఇంటర్వ్యూలో పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు రాశిఖన్నా స్పందిస్తూ .. "నాకు కాబోయేవాడు అందగాడు కాకపోయినా ఫరవాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడై ఉండాలి. భగవంతుడి పట్ల నమ్మకం కలిగినవాడై ఉండాలి" అంటూ చాలా సింపుల్ గా తేల్చేసింది.

సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎదురైతే హీరోయిన్లు ఒక పెద్ద లిస్టు చెబుతారు. అంతటివాడు .. ఇంతటివాడు అయ్యుండాలంటూ వయ్యారాలు పోతారు. అలాంటివాడు ఇంతవరకూ తారసపడలేదని తేల్చేస్తారు. కానీ పాపం రాశిఖన్నా తనకి కాబోయేవాడు భక్తిపరుడై ఉండాలని ఒక్క ముక్కలో చెప్పేసింది. అయినా ఇంత అందగత్తెను భార్యను చేస్తే ఎవరైనా దేవుడిని నమ్మకుండా ఎలా ఉంటారు?

  • Loading...

More Telugu News