Vice Chancellor: వర్సిటీల కులపతి పేరును 'కులగురు'గా మారుస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం!

 Madhyapradesh govt key decision on vice chancellors
  • వర్సిటీల పాలనాధిపతులుగా వైస్ చాన్సలర్లు
  • వీసీలను కులపతులుగా పేర్కొంటున్న వైనం
  • మహిళను కులపతిగా ఎలా పిలుస్తామన్న మంత్రి
  • పేరు మార్పు ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడి
విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను దేశీయ పరిభాషలో కులపతులు అనడం తెలిసిందే. అయితే కులపతి అనేది పురుషులకు సరిపోతుందని, మహిళలకు ఆ పదాన్ని వర్తింపజేయలేమని మధ్యప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. వైస్ చాన్సలర్ ను కులగురు అని పిలవాలని పేర్కొన్నారు. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ప్రతిపాదన చేశారు.

దీనిపై మంత్రి మోహన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, "వైస్ చానల్సర్ పదవికి ఒకవేళ మహిళ నియమితురాలైతే ఆమెను కులపతి అని పిలవలేం. ఓ స్త్రీకి ఆ పదం సరిపోదు. కులగురు అనే పదం అయితే మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని వివరించారు. పలువురు వైస్ చాన్సలర్లు కూడా ఇదే తరహాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, కులగురు అనే పదాన్ని వారు సమర్థించారని మంత్రి వెల్లడించారు.

పైగా, భారతదేశం గురు-శిష్య పరంపరకు పెట్టింది పేరని, ఆ విధంగానూ కులగురు అనేది సరిగ్గా సరిపోతుందని వారు అభిప్రాయపడినట్టు తెలిపారు. విశ్వవిద్యాలయాల చట్టం కింద కులపతి అనే పేరు మార్పు ప్రక్రియ ప్రారంభమైందని ఆయన వెల్లడించారు.
Vice Chancellor
Kulpati
Kulguru
Universities
Madhya Pradesh

More Telugu News