Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు మాతృవియోగం

Hero Akshay Kumar mother Aruna Bhatia passed away
  • ఆసుపత్రిలో కన్నుమూసిన అరుణా భాటియా
  • అనారోగ్యంతో బాధపడుతున్న వైనం
  • ఇటీవల పరిస్థితి విషమం
  • తల్లి కోసం లండన్ నుంచి వచ్చేసిన అక్షయ్ 
బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ కు మాతృవియోగం కలిగింది. అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ముంబయిలోని హీరానందిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్షయ్ కుమార్ కొన్నిరోజుల కిందట లండన్ నుంచి వచ్చేశారు.

నిన్న ఆయన చేసిన ట్వీట్ అరుణ భాటియా చివరిఘడియల్లో ఉన్నారన్న విషయాన్ని నిర్ధారించింది. తన తల్లి విషమపరిస్థితిలో ఉందని, ఈ సమయంలో అభిమానుల ప్రార్థనలు తమకు ఎంతో అవసరమని అక్షయ్ కుమార్ భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.

అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ అరుణా భాటియా నేటి ఉదయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దాంతో అక్షయ్ కుమార్ తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఈ వేదన భరింపరానిది అంటూ సోషల్ మీడియాలో స్పందించారు.

"నాకు సర్వం మా అమ్మే. ఇవాళ ఆమె కన్నుమూసింది. మరో లోకంలో ఉన్న మా నాన్నను తిరిగి కలిసేందుకు వెళ్లిపోయింది. మా అమ్మ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు... ఓంశాంతి" అంటూ పేర్కొన్నారు.
Akshay Kumar
Aruna Bhatia
Mother
Demise
Bollywood

More Telugu News