లేడీ కానిస్టేబుల్ కు సీమంతం జరిపిన ఇతర పోలీసులు
- సీమంతానికి వేదికగా గురజాల పోలీస్ స్టేషన్
- కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బంగారమ్మ
- సీమంతానికి హాజరైన ఉన్నతాధికారులు
- అందరికీ కృతజ్ఞతలు తెలిపిన బంగారమ్మ
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల డీఎస్పీ మెహర్ జయరాం హాజరయ్యారు. గురజాల టౌన్ సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. తోటి సిబ్బంది సమక్షంలో సీమంతం జరుపుకోవడం పట్ల కానిస్టేబుల్ బంగారమ్మ సంతోషంతో పొంగిపోయారు. అధికారులకు, సహచర కానిస్టేబుళ్లకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.