Tollywood: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు

ED arrests two more in Tollywood drugs case
  • ఈ రోజు యాక్టర్ నందును విచారణకు పిలిపించిన ఈడీ
  • కుదూస్, వాహాద్ లను తీసుకొచ్చిన ఈడీ
  • లావాదేవీలపై విచారణ జరుపుతున్న అధికారులు
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ను కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు పాతబస్తీకి చెందిన కుదూస్, వాహిద్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సినీ నటుడు నందును ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నందు, కెల్విన్, ఇతరుల మధ్య జరిగిన లావాదేవీలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. కెల్విన్ ను అదుపులోకి తీసుకునే ముందు నందును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

Tollywood
Enforcement Directorate
Drugs

More Telugu News