Venkaiah Naidu: వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి: వెంకయ్యనాయుడు

Everyone should be careful after vaccination also says Venkaiah Naidu
  • టీకా వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యం వద్దు
  • ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
  • మహమ్మారిపై పోరాటంలో ముందంజలో ఉన్నాం
స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకాల పంపిణీ కర్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు అవసరం లేదని... అందరూ ధైర్యంగా టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమం మాదిరి రూపుదాల్చాలని అన్నారు.

టీకా వేసుకున్నాం కదా అని నిర్లక్ష్యం వహించకూడదని... వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఒక అసాధారణమైన సమస్యను అసాధారణంగానే ఎదుర్కోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని... కరోనా మహమ్మారిపై సమష్టిగా పోరాడటంలో మనం ముందంజలో ఉన్నామని... రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Venkaiah Naidu
Corona Virus
Vaccination

More Telugu News