Talasani: విపక్ష నేతల విమర్శలు శ్రుతిమించితే హైదరాబాదులో తిరగలేరు: తలసాని

Talasani warns opposition leaders

  • ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • డబుల్ బెడ్ రూం ఇళ్లపై రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్య 
  • తమకు బలమైన క్యాడర్ ఉందని ఉద్ఘాటన

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్షనేతలపై ధ్వజమెత్తారు. ఓవైపు హైదరాబాదులో తాము చేసిన అభివృద్ధి కనిపిస్తూనే ఉన్నా, విపక్ష నేతలు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షనేతల తీరు శ్రుతిమించితే హైదరాబాదులో తిరగలేరని తలసాని హెచ్చరించారు. హైదరాబాదులో మరే పార్టీకి లేని క్యాడర్ తమకుందని స్పష్టం చేశారు. విపక్షనేతలకు కేటీఆర్ ను తట్టుకునే శక్తే లేదు... కేసీఆర్ ను తట్టుకుంటారా? అని వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News