Malla Vijayprasad: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ ను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు

Odisha police arrests YCP leader Malla Vijayprasad
  • చిట్ ఫండ్ వ్యవహారంలో ఒడిశాలో ఫిర్యాదులు
  • 2019లో విజయప్రసాద్ పై కేసు
  • నేడు అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
  • మేజిస్ట్రేట్ అనుమతితో ఒడిశా తరలింపు
ఓ చిట్ ఫండ్ కేసులో వైసీపీ నేత, వైజాగ్ (వెస్ట్) మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయప్రసాద్ ప్రస్తుతం ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నారు. 2019లో చిట్ ఫండ్ అవకతవకలకు సంబంధించి ఆయనపై ఒడిశాలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిన ఒడిశా సీఐడీ పోలీసులు తొలుత విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేజిస్ట్రేట్ అనుమతితో ఒడిశా తరలించారు.

మళ్ల విజయప్రసాద్ కు చిట్ ఫండ్ వ్యాపారం కూడా ఉంది. ఏపీలోనూ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేశారు. అయితే, తమకు చెల్లింపులు జరపడం లేదంటూ కొందరు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రెండేళ్ల కిందటే ఒడిశాలో కేసు నమోదైంది.
Malla Vijayprasad
Chitfund
Police
Odisha
YSRCP
Andhra Pradesh

More Telugu News