nandu: టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు: సినీన‌టుడు నందును విచారిస్తోన్న అధికారులు

trail in drugs case ed questions nandu
  • ఈడీ అధికారుల ఎదుట హాజ‌రైన నందు
  • బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలిస్తోన్న అధికారులు
  • అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ప్ర‌శ్నలు 
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచార‌ణ జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే  పూరి జగన్నాథ్,  చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్ విచార‌ణ‌కు హాజ‌రై ప‌లు వివ‌రాలు తెలిపారు. సినీన‌టుడు నందు ఈ నెల‌ 20న హాజ‌రుకావాల్సి ఉండ‌గా ఆ రోజు ఆయ‌నకు వేరే పనులున్న కారణంగా, ఈ రోజే ఈడీ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు.

మ‌నీలాండ‌రింగ్ కేసులో నందును అధికారులు విచారిస్తున్నారు. అతని బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలిస్తున్నారు. అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ప్ర‌శ్నిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్ కొన్ని రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోవ‌డంతో అధికారులు ఆయ‌న నుంచి కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు. ఆయ‌న ఇచ్చిన స‌మాచారం మేర‌కు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.
nandu
Enforcement Directorate
Hyderabad

More Telugu News