Academic Calender: 2021-22 విద్యాసంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter board announces academic calender
  • మొత్తం 220 రోజుల పాటు కొనసాగనున్న కాలేజీలు
  • ఫిబ్రవరి 23 నుంచి ప్రాక్టికల్స్
  • మార్చి 23 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు
  • ఏప్రిల్ 14 నుంచి వేసవి సెలవులు
తెలంగాణ ఇంటర్ బోర్డు 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. తాజా క్యాలెండర్ ప్రకారం... రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు 220 రోజుల పాటు జరుగుతాయి. ఆన్ లైన్ క్లాసులు 47 రోజులు, ఆఫ్ లైన్ క్లాసులు 173 రోజులు నిర్వహించనున్నారు. మూడు రోజుల దసరా సెలవులతో పాటు జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు జరపనున్నారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు థియరీ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
Academic Calender
Inter
Board
Telangana

More Telugu News