Hyderabad: బ్యూటీ సెలూన్ ముసుగులో మాదాపూర్‌లో వ్యభిచారం.. 10 మంది విటులు, 10 మంది యువతుల అరెస్ట్
- పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు
- రూ. 73 వేల నగదు, కారు, 28 సెల్‌ఫోన్లు స్వాధీనం
- ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి దందా
బ్యూటీ సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతోపాటు విటులు, యువతులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీ సెలూన్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిన్న సాయంత్రం దాడులు నిర్వహించారు.
స్పా నిర్వాహకుడితోపాటు అందులో పనిచేస్తున్న ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 73 వేల నగదు, 28 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు రూ. 4 లక్షలు నిల్వ ఉన్న బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.