Kapu Ramachandra Reddy: కాంట్రాక్టర్‌ను బెదిరించిన రాయదుర్గం వైసీపీ నేత.. వీడియో వైరల్!

kapu Ramachandra reddy aide Jayaramareddy warns contractor
  • నల్లంపల్లి నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు పనులకు రూ. 17 కోట్లు విడుదల
  • టెండరు దక్కించుకున్న డీఎంసీ సంస్థ
  • స్థానిక ఎమ్మెల్యే ‘కాపు’ను కలవకుండా పనులెలా చేస్తావని వాగ్వాదం
రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత జయరామరెడ్డి ఓ కాంట్రాక్టర్‌ను పనులు నిలిపివేయాలంటూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. డీఎంసీ అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది.

విషయం తెలిసిన జయరామరెడ్డి కాంట్రాక్టర్‌ను కలిసి వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. పనులు ఆపకుంటే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kapu Ramachandra Reddy
YSRCP
Jayaramareddy
Rayadurgam

More Telugu News