Bigg Boss-5: బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ ప్రారంభం

Bigg Boss Telugu fifth season starts
  • నేటి నుంచి బిగ్ బాస్-5
  • సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ మాలో ప్రసారం
  • హోస్ట్ గా మరోసారి నాగార్జున
  • ఈసారి మరింత కొత్తగా బిగ్ బాస్ హౌస్
బుల్లితెర ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించేందుకు బిగ్ బాస్ మళ్లీ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ నేడు ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో హుషారెత్తించే రీతిలో షురూ అయింది. హోస్ట్ గా నాగార్జున మరోసారి చేస్తున్నారు. వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగార్జున తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆపై బిగ్ బాస్ ను విష్ చేసి కార్యక్రమానికి మరింత జోష్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పట్లాగానే ఈసారి కూడా బిగ్ బాస్ షోలో డ్రామా, రొమాన్స్, యాక్షన్, ఫన్, కొత్త టాస్కులు కనువిందు చేయనున్నాయి.

ఇక, నాగ్ బిగ్ బాస్ హౌస్ ను ఆడియన్స్ కు పరిచయం చేశారు. గత సీజన్లతో పోలిస్తే ప్రతిదీ కొత్తగా డిజైన్ చేశారు. కంటికి ఇంపైన రంగులతో బిగ్ బాస్ హౌస్ ను తీర్చిదిద్దారు. బిగ్ బాస్ ఇంట్లోని అన్ని లొకేషన్లను నాగ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేశారు.
Bigg Boss-5
Telugu
Season-5
Nagarjuna
Telangana
Andhra Pradesh

More Telugu News