Mogulaiah: కిన్నెర కళాకారుడు మొగులయ్యకు స్వయంగా చెక్ అందించిన పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

Pawan Kalyan handed cash cheque to Kinnera artist Mogulaiah
  • కిన్నెర వాయిద్యంపై అద్భుత సంగీతం
  • మొగులయ్య ప్రతిభకు పవన్ ఫిదా
  • రూ.2 లక్షల ఆర్థికసాయం
  • జనసేన కార్యాలయంలో ఆత్మీయ సత్కారం
గిరిజన ప్రాంతాలకే పరిమితమైన కిన్నెర వాయిద్యంతో అద్భుతమైన గానం చేస్తూ రంజింప చేస్తున్న జానపద కళాకారుడు మొగులయ్యకు జనసేనాని పవన్ కల్యాణ్ ఆత్మీయ సత్కారం చేశారు. ఆయనకు శాలువా కప్పిన పవన్ రూ.2 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. ఈ మేరకు స్వయంగా మొగులయ్యకు చెక్ అందజేశారు.

ఇవాళ పార్టీ కార్యాలయంలో మొగులయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుండగా, టైటిల్ సాంగ్ లో మొగులయ్య తన గాత్రాన్ని అందించారు.
Mogulaiah
Cash Cheque
Pawan Kalyan
Kinnera Artist
Bheemla Naik

More Telugu News