700 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్ షీర్ ప్రతిఘటన దళాలు
- మరో 600 మందిని బంధించామని వెల్లడి
- కపీసా సరిహద్దులకు తరిమేశామని కామెంట్
- పంజ్ షీర్ లోని నాలుగు జిల్లాలను ఆక్రమించామన్న తాలిబన్లు
అయితే, నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అధికారులు మాత్రం.. తాలిబన్లను తరిమికొట్టామని ప్రకటించారు. కపీసా ప్రావిన్స్ సరిహద్దుల వరకు వారిని తరిమామని చెప్పారు. ఖవక్ పాస్ లో వేలాది మంది ఉగ్రమూకలను చుట్టుముట్టామని, 700 మంది తాలిబన్లను మట్టుబెట్టామని ప్రకటించారు. మరో 600 మంది తాలిబన్లను బంధించామని చెప్పారు. శనివారం రాత్రి నుంచి పంజ్ షీర్ లోని పర్యాన్ లో హోరాహోరీ సాగిందని ప్రకటించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దళాలు తాలిబన్లను దీటుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ దెబ్బకు ఉగ్రమూకలు ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను వదిలి పరారయ్యాని చెప్పారు.